가사
ఉన్నవాడు అనువాడు ఆకాశమే చాలని గొప్ప వాడు
కన్యమరియా ఆ.ఆ.ఆ
గర్భంబునా ఓ.ఓ.ఓ
నరరూపదారునిగా పుట్టినాడు
హల్లెలూయ అత్యున్నతుడు -
పరలోకము విడచి భువికొచ్చినాడు
సాటిలేని మహారాజు -
పశువుల పాకలో పరుండినాడు
1. ప్రపంచానికే మద్యలోవున్న - ఇశ్రాయేలు దేశమందు
వింతైన తారక మెరిసింది తూర్పున -
రోజులకే రారాజు పుట్టేనందున
పరలోక సైన్యము పాడిస్తుతించెను -
పశువుల కాపరులు పరవశించెను (2)
||హల్లెలూయ||ఉన్నవాడు||
2. ప్రవక్తలేందరో ప్రవచనాలెన్నో -
ముందుగాతెలిపిన లోకరక్షకుడు
పాపాన్ని క్షమీయించి పరివర్తన కలిగించే - పరిశుద్ధపరిచే దైవకుమారుడు
మంటీఘటములలో మహిమను నింపేవాడు - మహిమనుండి అధిక మహిమకు చేర్చువాడు
||హల్లెలూయ||ఉన్నవాడు||