가사
ఓ చందమామ ఓ చందమామ
ఓసారి చూసావో పున్నాగ పువ్వులే
ఓమారు నవ్వావో సన్నాయి పాటలే
ఓ చందమామ ఓ చందమామ
వెన్నెల్లో ఆడపిల్లై వెలుగల్లె రావా
కన్నుల్లో కాంతిపువ్వై కనువిందు తేవా
నడి రాతిరి కాటుకకి కనురెప్పలిచ్చావా
సడిచేసే పదనలకి ఒడి చేర్చి ఒదిగావా
అడివంతా చేతులు చాచి కౌగిలింతలిచ్చావా
సంద్రాల అలజడి మీద వెన్నెలై నిదురించావా
ఓ చందమామ ఓ చందమామ
ఓసారి చూసావో పున్నాగ పువ్వులే
ఓమారు నవ్వావో సన్నాయి పాటలే
ఓ చందమామ ఓ చందమామ
వెన్నెల్లో ఆడపిల్లై వెలుగల్లె రావా
కన్నుల్లో కాంతిపువ్వై కనువిందు తేవా
చిరుత కళ్ల పాపాయితో చెలిమి చేయ వచ్చావా
నెమలి కళ్ల చిన్నారితో చిందులాడ వెళ్లావా
పాలపుంత పరువాలకి పూల నవ్వులిచ్చావా
పూలతోటల నీడలకి తేనె పట్టులందించ్చావా
ఓ చందమామ ఓ చందమామ
ఓసారి చూసావో పున్నాగ పువ్వులే
ఓమారు నవ్వావో సన్నాయి పాటలే
ఓ చందమామ ఓ చందమామ
వెన్నెల్లో ఆడపిల్లై వెలుగల్లె రావా
కన్నుల్లో కాంతిపువ్వై కనువిందు తేవా