Letra da música
మాయ అని ఛాయలు చూస్తూ..
మోయలేని భారం మోస్తూ....
కాలం విడచి కాలగర్భంలో కలిసిపోతున్నవా....
భారమైన బ్రతుకునీడ్చుటూ మోసపోయావా...
సిద్ధపడని నీ జీవితం...అర్థమవని ఆత్మ ప్రయాణం....
దేహం విడచి దాహం అంటూ అరవబోచున్నదా..
ఖాయం విడచి ఆరని అగ్నికి ఆత్మ సిద్ధమైనదా....
ఇకనైనా బయటకు రారా అమాయక....
క్రీస్తు నందు ఉన్నవారికి ఉండదు శిక్షే ఇక....
భువి పైకి అడుగుపెట్టావు నీవు ఎందుకో..?
నెలవైన నడయాడావు నీవు ఎందుకో...?
నోటితోటి మాట్లాడు నీవు ఎందుకో...?
చేతితో కష్టపడ్డావు నీవు ఎందుకో...?
అవయవాలు ఇచ్చిన వాడిని విడచిపెట్టావు...
అనుభాండాలే ఆనందమని మోసపోయావు...
అందరూ ఉండగా నాకేంటి కొరతన్నావు....
అందరూ ఉండగానే కూలిపోయావు...